ఊపిరివై జీవితమంతా తోడుగా వుంటావనుకున్నాను ,
తుఫానుగా మారి నన్ను విడిచిపోతావు అనుకోలేదు.
స్పర్శవై నిలువెల్లా తడిపేస్తావనుకున్నాను ,
కలగా మారి కనుమరుగవుతావు అనుకోలేదు.
చిరునవ్వుతో నా మనసుకి దగ్గర అవుతావు అనుకున్నాను ,
కన్నీళ్లని తోడుగా ఇచ్చి దూరమవుతావు అనుకోలేదు .
నీ అడుగుల సవ్వడినే నా గుండెచప్పుడు చేస్తావనుకున్నాను ,
మౌనమనే గుణపాన్నే గుండెల్లో గుచ్చుతావు అనుకోలేదు .
అయినా కూడా
ఎదురుచూపులనే కలలుగా,
ఆశలనే ఊపిరిగా చేసుకుని ,
నీ జ్ఞాపకాల తోటలో ,
ఒంటరిగా బ్రతికేస్తా
No comments:
Post a Comment