Saturday, 25 January 2020

Gayapadina Manasu

నీకు దూరమైన "దూరాన్ని" ప్రేమిస్తున్నా . ,
ఏనాటికైనా దగ్గరగా చేస్తుందని . . .

నీ గొంతు వెనక దాగున్న "మౌనాన్ని" ప్రేమిస్తున్నా . ,
 ఏ నిమిషమైనా మాటగా మారుతుందని . . .


నీకోసం వచ్చే "కన్నీళ్లని" ప్రేమిస్తున్నా . ,
ఏదో ఒక రోజు చిరునవ్వుగా నన్నుచేరుతుందని . . .

నీకై కన్న "కలల్ని" ప్రేమిస్తున్నా . ,
ఎప్పటికైనా నిజం అవుతాయేమోనని . . .

అలసిపోతున్న  "ఎదురుచూపుల్ని" ప్రేమిస్తున్నా . ,
 అప్పుడైనా నా నాయనాలకు ఎదురుపడతావని . . .

నీకై స్పందించే "నా గుండె చప్పుడుని" ప్రేమిస్తున్నా . ,
 ఏ ఒక్క క్షణమైనా "నా ప్రాణం నువ్వే" అంటవేమోనని . . .

ఇలా ఊహలోనే  జీవించడం తప్ప ఊపిరిగా మారేదెప్పుడు 

Bhada

ఊపిరివై జీవితమంతా తోడుగా వుంటావనుకున్నాను ,
తుఫానుగా మారి నన్ను విడిచిపోతావు అనుకోలేదు.

స్పర్శవై నిలువెల్లా తడిపేస్తావనుకున్నాను ,
కలగా మారి కనుమరుగవుతావు అనుకోలేదు.

చిరునవ్వుతో నా మనసుకి దగ్గర అవుతావు అనుకున్నాను ,
కన్నీళ్లని తోడుగా ఇచ్చి దూరమవుతావు అనుకోలేదు .

నీ అడుగుల సవ్వడినే నా గుండెచప్పుడు చేస్తావనుకున్నాను ,
మౌనమనే గుణపాన్నే గుండెల్లో గుచ్చుతావు అనుకోలేదు .

అయినా కూడా
ఎదురుచూపులనే కలలుగా,
ఆశలనే ఊపిరిగా చేసుకుని ,
నీ జ్ఞాపకాల తోటలో ,
ఒంటరిగా బ్రతికేస్తా

Prema Gayam

కనుకొలనుల్లో కన్నీరు..

పెదవులంచున అణచిపెట్టిన బాధ..

చిరునవ్వు కరువైన మోము..

నీ జ్ఞాపకాలతో మసకబారిన మనసు..
గతాన్ని నెమరువేస్తూ గడిపిన నిద్రలేని రాత్రులు..

అయినా కూడా నిన్నే కోరుకుంటున్న హృదయం..

ఇవేనా నువ్వు నాకిచ్చిన ప్రేమ గుర్తులు???

About u

కొన్ని  మాటలను  మూటగట్టి ..
ముత్యాల్లా  నీ ముందు  పరిచి  
నీనవ్వుల వర్షంలో   తడుద్దాం అనుకున్నా... 

కానీ... ఎప్పటికైనా నువ్వు  
వెళ్లిపోయే   అతిధివనే   మాట గుర్తొచ్చి    😔
మళ్ళి  మౌనాన్ని   ఆశ్రయించా 😑
ఒంటరి  అక్షరంతో  జతకట్టా 

Learn yourself

ఒప్పుకోవలిసినవి: పుట్టుకు,
కులం,లోపం, గతం , విమర్శ 

దాచుకోవలిసినవీ :
చేసిన ధానం,
ఆర్జించిన ధనం,
నీ వ్యక్తిగత  విషయాలు,
కుటుంభంలోని  గొడవలు 
నీవిజయం 

చెప్పుకోవలిసినవి: అనుభవాలు, పాఠాలు, దెబ్బలు, తప్పులు 

మెచ్చుకోవలిసినవి :  ఎదుటోడి ప్రతిభ, 
మంచిపని,  అరుదైన  వ్యక్తిత్వమ్

Know your strength

నీ బలం , నీకు  తెలిసేది , తెలిపేది 
నీ విమర్శకులు  వల్లే.. 

చాలా విజయాలు  విమర్శకులే  తెచ్చిపెడతారు   
వేలెత్తి చూపించేవాడు లేకపోతె
 నీ వెల తెలియదు 

నీవిజయంలో వాటా వారికీ ఇవ్వడం మర్చిపోకు 
విమర్శ నొప్పే కానీ,
దాన్నీ స్వీకరించి
ఇచ్చే సమాధానం చాలా 👌కిక్ నీ ఇస్తుంది

Friday, 24 January 2020

Know the truth

మంచి ప్రవర్తన వల్ల ఉత్తముడివి అవుతావు 
కానీ... 
ఉన్నతమైన పదవులు
పొందడం వల్లకాదు.

   ఎక్కువ ఎత్తుకి  ఎగిరినంత మాత్రాన..
 కాకి  గరుడపక్షి  అవ్వదుగా  !

Krishnayya

నడిపించే నాకృష్ణ వా 
పూజించే నాస్వామివా  
ఎదలో ప్రతీ మదిలో  జ్వలించే దీపానివ 
కథనీ  ప్రతీ మా వ్యధనీ తీర్చేది నీవే కదా 
పసలేని పామరుడినైనా 
పండితుణ్ణి చేసేది నీధ్యానం కదా 
మొదలే ఎట్టా ఉన్నా చివరకు చేసేది నీ నామస్మరణే కదా 
కదిలించే నాకన్నయ్య వా 
తోడుఉండే నా ధైర్యనివా 
కృష్ణోదయం 🙏 

Thursday, 23 January 2020

Vyadha

నా వ్యధ   చెప్పేలోపే .. 
మన  కథ    ముగించావు.. 

ఒంటరిగా  వెళ్ళా  అని 
 నువ్వు  అనుకున్నావు   
ఓటమిగా  మిగిలా  అని నాకు అర్ధమైంది 

నా ప్రేమకు  కొలమానం  లేదు 
ఎదురుచూపులు  తప్ప !

ఎదురవుతావో... ఎద  అవుతావో 
ఆ  కాలానికే   వదిలేసా మన గాధనీ 

character

మనిషికి  మానం  కంటే ..
వ్యక్తిత్వమ్  చాల  ప్రధానం  

విద్య లేనివాడు వింత పశువైతే.. 

వ్యక్తిత్వమ్   లేనివాడు .. జీవే కాదు

chitti chilakamma

చిలకనుచూసి  కాకమ్మ  
 రంగులుపూయకు  నీవమ్మా   
నీవు కుడా చిలకైతే  ఓయమ్మా
నీ జాతేమి  కావాలో చెప్పమ్మా 
నలుపే  కదా మరి  నీ జన్మ  
ఎవరికన్నా తక్కువ నివమ్మ 
సహజ గుణమే కదా  గొప్పమ్మ 

నువ్ నీలానే ఉండు

ఎందుకంటే
 నీతో  కడవరకు ఉండేది   మరి నువ్వేగా
నీ నీడ కుడా  నీ తోడు రాదుగా

Wednesday, 22 January 2020

Prema o prema

నీ తలపు  వదిలి  క్షణమైనా  
నేను  ఉండగలనా  ???
నీ  నిస్వార్థ    ప్రేమలో   మునిగాను   కనుక !

నీ పిలుపు వినని   రోజైన నాకు ఉండదేమో  
నీ  మాటలే  "ముత్యాలు "గా  
కొలిచాను  కనుక  🤗

Prayatnam

ప్రయత్నాలు  అన్ని   విజయాలుగా 
మారకపోవచ్చు ... 
కానీ... నీలోని   సమర్థతనీ   లెక్కిస్తాయి 
నీ  ప్రతిభను   మెరుగుపరుస్తాయి   
ప్రతీ ప్రయత్నం ..ప్రతీ  ఓటమి.. ఒక్కో  అనుభవం 
ఒక్కోమెట్టు  ఎక్కిస్తూ.. 
జీవితంలో నువ్వు  దేన్నయినా తట్టుకొనే  
 మానసిక  సామర్ధ్యన్నీ  ఇస్తాయి !

Life

గొప్పవ్యక్తిగా  ఎదగకపోయినా  పర్వాలేదు 

చెడ్డమనిషిగా   బ్రతకకపొతే.... చాలూ...

Tuesday, 21 January 2020

Waiting for you

సశేషమైపోయిన   నా  కథలో  

విశేషంగా   వినిపించేది  ఒక్క  నీపేరే   మానస !

Monday, 20 January 2020

Prapamcham

Kalisundataniki veeluledu
Vadulukotaniki veelu radhu
 Na life lo Tanu eppatiki naku important a

Sunday, 19 January 2020

Suicide

చనిపోవడానికి చనిపోవాలనే  
ఒక్కఆలోచన వస్తే చాలూ !

కానీ..... 
బ్రతకడానికి   గుండెల్లో    ధైర్యంతోపాటు, సమాజంతోపాటు   సాగిపోయే  
 చాలా ముసుగులు కావాలి !

Truth Among Lover's

ఇద్దరు ప్రేమికులు శాశ్వతంగా విడిపోయేది 

ఒకరితో ఒకరు మాట్లాడుకోనప్పుడు  కాదు 

ఒకర్ని ,  ఒకరు  తల్చుకోనప్పుడు  !

Lifecycle

కొందరు మన జీవితంలో    +  అవుతారు 
    .......    కొందరు నిన్ను    _  చేస్తారు  

కానీ...... 
నీ  Time  వచ్చినప్పుడు 
 కాలం  అన్ని  =  చేసేస్తుంది   

ఇదే  జీవితం అనే లెక్కకి  సరైన జవాబు !

Nijam

ప్రేమించినవారీ  కోసం   ఏది  ఇష్టమో.. 
అదీ చెయ్యకపోయినా.. పర్వాలేదు.. 

ఏది  ఇష్టం లేదో... వాటిని  వదిలేస్తే చాలు 
బంధాలు   కొనసాగుతూనే... ఉంటాయి