Saturday 22 February 2020

Bitter truth about love

అందరూ ప్రేమి "ఇ "స్తారు 

కొందరు ప్రేమని "నటి "ఇ"స్తారు

 మరికొందరు   ప్రే"మనీ" స్తారు 

ఇంకొందరు ప్రేమని "మన్ని "స్తారు 

అతి  కొందరు  ప్రేమలో "మరణ "ఇస్తారు 

  మరికొందరు 'ప్రేముంచే' స్తారు

చాలా కొందరే  ప్రేమని
"  ప్రేమగా "  ప్రేమిస్తారు
తిరిగి ఇస్తారు ❤

Thursday 20 February 2020

Good Night

ఆమందారాన్ని ముద్దాడితే  మూతివిరుపుతో
పలికినది
నీ  అధరాలకంటే తన రంగు తక్కవనీ

ఆ సంపెంగతో  స్నేహానికి  చేయికలిపితే
వద్దంటూ విదిలించింది
తనకంటే సూటైన నీ నాసికకు
  చనువిచ్ఛానని 

కలువలు కయ్యానికిదూకాయి
నీనయనాలకు  బానిసనయానని   

మల్లెలు మారం చేసాయి
నీ కొప్పులో   నేలవ్వవాలని

చామంతులు  చెలికత్తెలుగా  మారాయి
నీ సిగ్గు దొంతరలలో   తడిచి ..

ఎన్నో  యుద్దాలని  చేసిన 
ఖడ్గాలు   తలదించుకొన్నాయి  
.. నీ రవికలోని  ఆ  బిగువులు  చూసి  

అశ్వాలు  అయోమయంలో  పడ్డాయి 
నీ జగణాల  బరువుని   మోసి 

ఆకాశం చిన్నబోయింది
  ఈసుందరికి  చోటివ్వలేదని
#శుభరాత్రి

Thursday 13 February 2020

Curse of Love

కన్నీళ్లతో  కుడా కాపురం  చెయ్యొచ్చనీ  
కొంతమంది  
నేర్పించే  వెళతారు 

Perfect Relationship

ఒకరితో  నీకు  " ముడిపడిన "  బంధం  మనసుది  ❤ ( హృదయంతో  )  
 అయితే... 
వదిలించుకుందామన్నా.. 
 వదలదు..

 అదే  ముడిపడిన బంధం
  మనిషితో (  మైండ్ ) తో  అయితే  అతికించుకుందామన్నా... అతకదూ !

Selfish Love

శాశ్వతమైన  ప్రేమ,  శాశ్వతమయ్యే బంధాలు  బహుశా  భూమి మీద  ఇక పై  దొరకకపోవొచ్చు  😑

తాత్కాలికమే  శాశ్వతం  
అనే చట్టం కుడా రావొచ్చు 🤔 

Unfaithful Love

లోపాలు లేకుండా  ప్రేమిస్తే    లోకంలో  నిలిచిపోతా  అనుకున్నా   !

కానీ.... నీకె  
లోకువ అయిపోతా అనుకోలేదు!

Truthful Character

అబద్ధం చెప్పకు
దొరికేసాక అలుసు ఐపోతావు..
నిజం చెప్పేయ్
అర్థం చేసుకున్నాకైనా ఆదరిస్తారు..

Friday 7 February 2020

Sleeping pillow

కన్నీటితో దాహం తీర్చుకునే తలగడ
ఉదయానికంతా ప్రశాంతంగా నిద్రలేపుతున్న కిరణాలను నవ్వుతూ చూడమంటుంది..
దానికి తెల్సు ప్రతిరాత్రి నాకు కాళరాత్రని
నే ప్రేమించేది కన్నీటినని

Thursday 6 February 2020

Gundello Bhada

మనసును చీల్చే నీ మాటల పై ఎదురు దాడి చేయడానికి‌... నేను ఆయుధాన్ని అవ్వను... మౌనాన్ని ఆశ్రయిస్తాను...

మనసు విరిగిన రోజే వస్తే
నీ నుండి దూరం జరగడమే తప్ప తిరగబడలేను...

నా ప్రేమ ఇంతే 
దాని తీరు అంతే...
నిన్ను నొప్పించి నేను పొందేది అశాంతే కదా..!!

Sunday 2 February 2020

Good morning

తొలిసంధ్య వేలలో…. తొలిపొద్దు
పొడుపులో..తెలవారే తూరుపులో వినిపించే రాగం
భూపాలం …..
ఎగిరొచ్చే కెరటం సింధూరం
జీవితమే రంగుల వలయం…దానికి ఆరభం
సూర్యుని ఉదయం
గడిచే ప్రతినిమిషం ఎదిగే ప్రతిభింభం
వెతికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం
అ హృదయం సంధ్యా రాగం…… మేలుకొలిపే
అనురాగం.