Thursday, 20 February 2020

Good Night

ఆమందారాన్ని ముద్దాడితే  మూతివిరుపుతో
పలికినది
నీ  అధరాలకంటే తన రంగు తక్కవనీ

ఆ సంపెంగతో  స్నేహానికి  చేయికలిపితే
వద్దంటూ విదిలించింది
తనకంటే సూటైన నీ నాసికకు
  చనువిచ్ఛానని 

కలువలు కయ్యానికిదూకాయి
నీనయనాలకు  బానిసనయానని   

మల్లెలు మారం చేసాయి
నీ కొప్పులో   నేలవ్వవాలని

చామంతులు  చెలికత్తెలుగా  మారాయి
నీ సిగ్గు దొంతరలలో   తడిచి ..

ఎన్నో  యుద్దాలని  చేసిన 
ఖడ్గాలు   తలదించుకొన్నాయి  
.. నీ రవికలోని  ఆ  బిగువులు  చూసి  

అశ్వాలు  అయోమయంలో  పడ్డాయి 
నీ జగణాల  బరువుని   మోసి 

ఆకాశం చిన్నబోయింది
  ఈసుందరికి  చోటివ్వలేదని
#శుభరాత్రి

No comments:

Post a Comment